ఇది నీ అబ్బ సొత్తా?” – బెంగళూరులో చెలరేగిన మతపరమైన ఘర్షణ.. ఆర్మీ అధికారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన యువకులు..!!

బెంగళూరులోని అప్పిగెరె ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో మాజీ భారత ఆర్మీ అధికారి మరియు అతని భార్య, ఒక ముస్లిం యువకుడిని మతపరంగా దూషించిన ఘటన కలకలం రేపింది.

సదరు యువకుడిని ఆ దంపతులు “నువ్వు ముస్లింవి, పాకిస్థానీవి, ఒక ఉగ్రవాదివి” అంటూ దూషించినట్లు సమాచారం. దీంతో ఆగ్రహం చెందిన ఆ యువకుడు, తన స్నేహితులతో కలిసి ఆ దంపతుల ఇంటి వద్దకే వెళ్లి నిలదీశాడు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో, తెల్లటి చొక్కా ధరించిన ఒక యువకుడు ఆ మాజీ ఆర్మీ అధికారిని ఉద్దేశించి.. “ఇదేమైనా మీ అబ్బ సొత్తు అనుకుంటున్నారా? ఇది అందరికీ సమానమైన దేశం. మీరు ఆర్మీలో పనిచేసిన వారు, మీకు దేశభక్తి ఎక్కువగా ఉండాలి. అలాంటిది మీ భార్య ఒక వ్యక్తిని చూసి ఉగ్రవాది అని ఎలా అంటుంది?” అంటూ ఆవేశంగా ప్రశ్నించాడు. అంతేకాకుండా, ఇది కర్ణాటక అని, ఇక్కడ మతపరమైన విభజనను ప్రోత్సహించవద్దని హెచ్చరించాడు. మళ్లీ ఇలాగే జరిగితే అపార్ట్‌మెంట్‌లోకి వచ్చి రోడ్డు మీదకు లాగి అవమానిస్తామని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. యువకుల నుండి వ్యక్తమైన ఈ తీవ్ర నిరసనతో, ఆ దంపతులు తమ మాటలకు క్షమాపణ చెప్పడంతో ఉద్రిక్తత నెమ్మదించింది.


Posted

in

by

Tags: