మధ్యప్రదేశ్‌లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. నిన్న గణిత శాస్త్ర (Maths) పరీక్ష జరిగింది. ధార్ జిల్లా పీతంపూర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాల పరీక్షా కేంద్రానికి ఒక విద్యార్థిని పరీక్ష రాయడానికి వచ్చింది.
పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత, ఆ విద్యార్థినికి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఉపాధ్యాయుల అనుమతి తీసుకుని బాత్రూమ్కు వెళ్ళిన ఆమె, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన టీచర్లు అక్కడికి వెళ్లి చూశారు.
అక్కడ బాత్రూమ్లోనే ఆ విద్యార్థిని మగబిడ్డకు జన్మనివ్వడం చూసి ఉపాధ్యాయులు విస్తుపోయారు. వెంటనే 108 అంబులెన్స్‌ను పిలిపించి తల్లిని, బిడ్డను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, ఆ అమ్మాయి గర్భవతి అన్న విషయం ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలియదని సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.
