ఇదేం వింత సహాయం..? ఎస్కలేటర్ ఎక్కడానికి భయపడిన మహిళ.. వెనుక నుంచి వచ్చిన యువకుడు చేసిన ‘జెంటిల్ టచ్’.. వైరల్ వీడియో!

ఇటీవల ‘X’ (ట్విట్టర్) వేదికగా ఒక ఆసక్తికరమైన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరు మహిళలు ఎస్కలేటర్ ఎక్కడానికి వస్తారు. వారిలో ఒకరు ఇప్పటికే ఎస్కలేటర్ ఎక్కగా, మరొక మహిళ మాత్రం కాలు పెట్టడానికి వెనకాడుతూ, కాస్త భయపడుతూ అక్కడే నిలబడిపోతుంది.

ఆ సమయంలో, వెనుక నుంచి వస్తున్న ఒక యువకుడు ఆమె తడబాటును గమనించాడు. వెంటనే అతను తన నడుము భాగంతో ఆమె నడుమును సున్నితంగా నెట్టాడు (Gentle Nudge). ఆ చిన్నపాటి తోపుతో ఆమె అసంకల్పితంగా ముందడుగు వేసి ఎస్కలేటర్ ఎక్కేసింది. ఆ తర్వాత ఆమె ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags: