ఇద్దరు పిల్లల తల్లి, ప్రియుడితో కలిసి భర్తను సజీవ దహనం చేయడానికి యత్నం.. మంచానికి కట్టి నిప్పంటించిన భార్య!

సిద్ధార్థ్ నగర్ (యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్ జిల్లా, డూమరియాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహరా గ్రామంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. వివాహిత ఒకరు తన ప్రియుడితో కలిసి భర్తను మంచానికి కట్టి, కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారు.

ఏం జరిగింది? రెహరా గ్రామానికి చెందిన లాల్జీ గౌతమ్ భార్య పూజా గౌతమ్‌కు, గోరఖ్‌పూర్‌కు చెందిన ఫిరోజ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. గురువారం రాత్రి ఫిరోజ్ ఇంటికి రాగా, ఇద్దరూ కలిసి నిద్రిస్తున్న లాల్జీ గౌతమ్‌ను మంచానికి బలంగా కట్టేశారు. అనంతరం అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. లాల్జీ కేకలు విన్న తండ్రి, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. తీవ్రగాయాలైన బాధితుడిని మొదట బెన్వా సీహెచ్‌సీకి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బస్తీ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

బాధితుడి తండ్రి ఘమ్మల్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పూజా గౌతమ్ మరియు ప్రియుడు ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫొరెన్సిక్ బృందం సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలను సేకరించింది.

మరో ఘటన: అలీగఢ్‌లో ప్రేమికులపై దాడి

అలీగఢ్‌లోని రోరావర్ ప్రాంతంలో మరొక జంటను స్థానికులు, కుటుంబ సభ్యులు పట్టుకుని చెప్పులతో కొట్టిన ఘటన జరిగింది. ఇద్దరూ వివాహితులని, ఇంటి నుండి పారిపోయి వెళ్తున్నారని తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.


Posted

in

by

Tags: