సాధారణంగా శరీరంలో ఐరన్ (ఇనుము) లోపాన్ని తగ్గించుకోవడానికి చాలామంది ఇనుప కడాయిలను వాడుతుంటారు. ఇది మంచి పద్ధతే అయినప్పటికీ, కొన్ని పదార్థాలు ఇనుముతో కలిసినప్పుడు రసాయన చర్య జరిగి ఆహారం విషపూరితంగా మారుతుంది.
ఇనుప కడాయిలో వండకూడని పదార్థాలు ఇవే:
- టొమాటో, చింతపండు మరియు నిమ్మరసం: పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలను ఇనుప కడాయిలో వండకూడదు. వీటిలో ఉండే యాసిడ్ (ఆమ్లం), ఇనుముతో చర్య జరపడం వల్ల ఆహారం లోహపు రుచిని పొందుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే అవకాశం ఉంది.
- పెరుగుతో చేసే వంటకాలు: కడి (మజ్జిగ పులుసు) లేదా పెరుగు గ్రేవీ ఉండే వంటకాలను ఇనుప కడాయిలో వండటం వల్ల పెరుగు విరిగిపోవడమే కాకుండా, శరీరానికి హాని కలిగించేలా మారుతుంది.
- పాలు మరియు పాల పదార్థాలు: పాలు, ఖీర్ (పాయసం) లేదా కస్టర్డ్ వంటివి ఇనుప కడాయిలో వండకూడదు. ఇవి త్వరగా పాడైపోతాయి లేదా విరిగిపోతాయి, దీనివల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది.
- రాజ్మా మరియు చోలే: ఇనుప కడాయిలో వేడి అన్ని వైపులా సమానంగా అందదు. దీనివల్ల రాజ్మా లేదా చోలే వంటివి కొన్ని ఉడికి, మరికొన్ని పచ్చిగా ఉండిపోతాయి. వీటిని తినడం వల్ల కడుపు ఉబ్బరం (Bloating) వంటి సమస్యలు వస్తాయి.
- చైనీస్ ఫుడ్: వెనిగర్ ఉపయోగించే చైనీస్ వంటకాలను ఇనుప కడాయిలో చేయకూడదు. వెనిగర్ ఇనుముతో వేగంగా చర్య జరుపుతుంది, ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
ఎందుకు ప్రమాదం?
వైద్యుల అభిప్రాయం ప్రకారం, పైన పేర్కొన్న పదార్థాలను ఇనుప కడాయిలో వండటం వల్ల తీవ్రమైన చర్మ అలర్జీలు (Skin Infections) లేదా జీర్ణకోశ సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఇనుప కడాయిని కేవలం డ్రై రోస్ట్ (వేయించడం) లేదా పులుపు లేని కూరలు వండటానికి మాత్రమే వాడటం ఉత్తమం.
