‘మహాభారతం’, ‘బ్రహ్మాస్త్ర’ వంటి ప్రజాదరణ పొందిన సినిమాలు, సీరియళ్ల ద్వారా గుర్తింపు పొందిన నటుడు, మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) రెజ్లర్ సౌరవ్ గుర్జర్ (Saurav Gurjar) పై ఒక యువతి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది.
29 ఏళ్ల సదరు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు వేగంగా స్పందించి ఆయనను ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, సౌరవ్ గుర్జర్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, 2021లో సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ ద్వారా సౌరవ్ గుర్జర్తో పరిచయం ఏర్పడింది. రోజులు గడిచేకొద్దీ ఇద్దరూ తమ ఫోన్ నంబర్లు మార్చుకుని వాట్సాప్లో ఎక్కువగా మాట్లాడుకునేవారు. 2021 డిసెంబర్ 25న ఇద్దరూ నేరుగా కలుసుకున్న సమయంలో, ఆ నటుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వరుసగా మోసం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేసింది.
సినీ, బుల్లితెర రంగంలో పేరున్న ఒక ప్రముఖ నటుడు ఇలాంటి లైంగిక వేధింపుల కేసులో చిక్కుకుని రిమాండ్కు వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. గతంలో పలువురు ప్రముఖులు, దర్శకులపై వచ్చిన ఇటువంటి కేసుల వరుసలోనే ఇప్పుడు ఈ అంశం కూడా నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేయడంతో మరిన్ని కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply