ఇన్‌‌స్టా యూజర్‌నేమ్ మార్చుకోవాలా.? కొన్ని నిమిషాల్లో మార్చేయొచ్చు.! ఇదీ సులభమైన విధానం.

ఇన్‌స్టాగ్రామ్‌లో మొదట్లో పెట్టుకున్న యూజర్‌నేమ్ కొంతకాలం తర్వాత నచ్చకపోవచ్చు. వృత్తి, వ్యక్తిగత గుర్తింపు లేదా సోషల్ మీడియా వినియోగానికి తగినట్లుగా కొత్త యూజర్‌నేమ్‌ను మార్చుకోవాలని అనుకునేవారు కూడా ఉండొచ్చు.

అలాంటి వారు ఇన్‌స్టాగ్రామ్ యాప్ నుంచే తమ యూజర్‌నేమ్‌ను సులభంగా మార్చుకోవచ్చు.

ముందుగా, మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోకి లాగిన్ అయి, కింది భాగంలో ఉన్న Profile (ప్రొఫైల్) విభాగానికి వెళ్లాలి. అక్కడ మీ ప్రొఫైల్ కింద ఉన్న Edit Profile (ఎడిట్ ప్రొఫైల్) అనే ఆప్షన్‌‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత Username (యూజర్‌నేమ్) విభాగంలో ఉన్న పాత పేరును తొలగించి, మీరు కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్న యూజర్‌నేమ్‌ను నమోదు చేయాలి.

మీరు ఎంచుకునే యూజర్‌నేమ్‌ను అప్పటికే వేరే ఎవరూ ఉపయోగించి ఉండకూడదు. కొత్త పేరు అందుబాటులో ఉంటే, దాన్ని ఎంచుకుని మార్పులను సేవ్ (Save) చేయవచ్చు. యూజర్‌నేమ్ మీ ఇన్‌‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కు గుర్తింపుగా ఉండటమే కాకుండా, మీ ప్రొఫైల్ లింక్‌లో కూడా ఒక భాగంగా ఉంటుంది.

అలాగే, ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌ను ఒకసారి కంటే ఎక్కువసార్లు మార్చుకునే సదుపాయం కూడా ఉంది. కొత్త యూజర్‌నేమ్‌కు మారిన తర్వాత, మళ్లీ మీ పాత యూజర్‌నేమ్‌ను తిరిగి పొందాలంటే, 14 రోజుల లోపు దాన్ని వేరే ఎవరూ వాడకుండా ఉండాలి. యూజర్‌నేమ్‌లో అక్షరాలు, అంకెలు మరియు అండర్‌స్కోర్ (_) వంటివి ఉపయోగించవచ్చు; గరిష్టంగా 30 క్యారెక్టర్ల వరకు వాడుకోవచ్చు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *