ఇప్పటికే ముగ్గురు పిల్లల తల్లి.! ఆసుపత్రిలో జన్మించిన తర్వాతి బిడ్డ. మహిళను చిత్రహింసలు పెట్టిన అత్తగారింటి వారు.. చివరికి జరిగిన విషాద సంఘటన.!!

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత అనే మహిళ, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గత వారమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు 4వది కూడా ఆడపిల్లే జన్మించడంతో, ఆమె భర్త మరియు అత్తగారింటి వారి చిత్రహింసలు ఎక్కువయ్యాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన మమత, ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆసుపత్రి ప్రాంగణంలోనే తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలాన్ని, విషాదాన్ని నింపింది. భర్త కుటుంబ సభ్యుల నిరంతర వేధింపులు, గొడవలే మమత ఆత్మహత్యకు కారణమని ఆమె బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags: