ఇరాన్‌పై యూఏఈ మొదటిసారి దాడి.. చమురును వదిలి టెహ్రాన్ బలహీనతపై బాంబుల వర్షం!

అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ చమురు నిల్వలు, సైనిక స్థావరాలపై దాడులు చేస్తుండగా, తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కూడా ఈ యుద్ధంలోకి ప్రవేశించింది. యుద్ధం మొదలైన తర్వాత యూఏఈ మొదటిసారిగా ఇరాన్‌పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ అతిపెద్ద బలహీనత అయిన ‘వాటర్ ప్లాంట్‌’ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది.

నీటి వనరులపై దాడి – ఇరాన్ ఉక్కిరిబిక్కిరి: గల్ఫ్ ప్రాంతంలో చమురు కంటే నీరు చాలా విలువైనది. ఇరాన్‌లో మెజారిటీ భాగం ఎడారి మరియు పొడి ప్రాంతం కావడంతో, తీరప్రాంతంలోని లక్షలాది మంది ప్రజలు సముద్రపు నీటిని శుద్ధి చేసే ‘డిశాలినేషన్ ప్లాంట్ల’పైనే ఆధారపడతారు. ఈ ప్లాంట్లపై దాడి చేయడం అంటే కేవలం భవనాలను కూల్చడం కాదు, ప్రజలను మరియు సైన్యాన్ని మంచినీరు అందకుండా చేసి లొంగదీసుకోవడమే (Total War).

దాడులు – ప్రతిదాడులు: యూఏఈ కంటే ముందే అమెరికా చేసిన దాడి వల్ల ఇరాన్‌లోని 30 గ్రామాలు నీరు లేక తలడిల్లుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ద్రోన్లతో దాడి చేసింది.

యూఏఈకి జరిగిన నష్టం: ఇరాన్‌పై దాడి చేయడానికి ముందు యూఏఈ కూడా భారీ మూల్యం చెల్లించుకుంది. ఇరాన్ చేసిన దాడుల్లో యూఏఈలో పనిచేస్తున్న నలుగురు ప్రవాసులు (పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ పౌరులు) మరణించారు. ఇప్పటివరకు యూఏఈపై ఇరాన్ 238 బాలిస్టిక్ మిసైళ్లు, 1422 ద్రోన్లతో విరుచుకుపడింది. వీటిలో మెజారిటీ దాడులను యూఏఈ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.

అసలు యూఏఈ దాడి చేసిందా? ఈ వార్త వైరల్ అయినప్పటికీ, యూఏఈ అధికారికంగా ఈ దాడిని ధృవీకరించలేదు. పౌర సదుపాయాలను తాము లక్ష్యంగా చేసుకోలేదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. వ్యూహకర్తల అభిప్రాయం ప్రకారం.. యూఏఈ ఒకవేళ యుద్ధంలోకి దిగితే మానవీయ సంక్షోభం కలిగించే వాటర్ ప్లాంట్ల కంటే సైనిక స్థావరాలనే ఎక్కువగా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.


Posted

in

by

Tags: