విశ్లేషణ: ఇరాన్ యొక్క బలం మరియు స్థిరత్వం అనేది భారతదేశ బలానికి, అభివృద్ధికి ఎంతో కీలకం. చమురు సంపద, వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా ఇరాన్‌ను మిత్రునిగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో భారత్‌పై అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించినప్పుడు మనకు అండగా నిలిచిన దేశం ఇరాన్.
అంతర్జాతీయ వేదికపై వివిధ సందర్భాల్లో భారత్‌కు అనుకూలమైన వైఖరిని తీసుకున్న దేశం ఇది. మనకు విదేశీ మారక ద్రవ్య (Foreign Exchange) సంక్షోభం వచ్చినప్పుడు ఆదుకున్నది, ఇకముందు కూడా తోడుగా నిలిచేది ఇరాన్. పెట్రోల్ ధరలు లేదా డాలర్ల కొరత ఉన్నా.. “రూపాయిల ద్వారానే చమురు కొనుగోలు చేయండి” అని మనకు వెసులుబాటు కల్పించిన దేశం కూడా ఇరానే.
అమెరికా మరియు ఇజ్రాయెల్ ఏకపక్షంగా యుద్ధాన్ని ప్రారంభించి, ఇరాన్ సుప్రీం లీడర్‌ను చంపడాన్ని ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా మనం ఖండించాల్సిన బాధ్యత ఉంది. అది నైతికత కావచ్చు లేదా ధర్మం కావచ్చు.. కష్టకాలంలో మనకు చేయూతనిచ్చిన దేశానికి కృతజ్ఞతగానైనా మనం మద్దతు తెలపాలి. అంతర్జాతీయ సమాజం ముందు ద్రోహిగా నిలబడకుండా ఉండాలి. చివరికి భారత ప్రయోజనాల కోసమైనా మనం ఖండనను నమోదు చేయాలి.
భవిష్యత్తులో భారత అభివృద్ధికి తోడ్పడే అవకాశాలను మనం కోల్పోకూడదు. చమురు నిల్వలు, వ్యూహాత్మక ప్రాంతాలు ఇలా అన్నింటా ఇరాన్‌తో సంబంధాలను దృఢంగా ఉంచుకోవడమే రక్షణ మరియు ఆర్థిక రంగాల్లో మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మన పాత శత్రువులు ఇప్పుడు వారి స్వార్థం కోసం మన దగ్గరకు రావచ్చు, కానీ ఇలాంటి క్లిష్ట సమయాల్లో మనం మన స్నేహాన్ని, కృతజ్ఞతను చాటుకోవాలి.

Leave a Reply