ఇరాన్ ఉచ్చులో అమెరికా! వణికిపోతున్న ఇజ్రాయెల్! ట్రంప్‌కు అత్యవసర ఫోన్ కాల్! మిడిల్ ఈస్ట్‌లో ‘దిక్ దిక్’

టెల్ అవీవ్: “ఏదో ఒక దారి చూసి ఈ యుద్ధాన్ని ముగించు నాయనా!” – ఇజ్రాయెల్ నుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వెళ్ళిన రహస్య సందేశం సారాంశం ఇది.

ఒకప్పుడు ‘ఇరాన్ సంగతి తేలుస్తాం’ అని బయలుదేరిన ఇజ్రాయెల్, ఇప్పుడు దెబ్బతిన్న పులిలా వెనక్కి తగ్గుతోంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ అనూహ్య పరిణామాల వెనుక ఉన్న అసలు కథ ఇదీ!

ట్రంప్‌పై ఒత్తిడి: “మనకు ఒక ‘ఎగ్జిట్ ప్లాన్’ కావాలి!”
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు ఆకాశాన్ని తాకుతున్న ముడి చమురు ధరలు, మరోవైపు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి. “ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే, అమెరికా రాజకీయాల్లో మనకే పెద్ద ‘బ్యాక్‌లాష్’ (Backlash) అవుతుంది. అందుకే, ఇరాన్‌తో ఈ యుద్ధం నుండి బయటపడటానికి ఒక ‘ఎగ్జిట్ ప్లాన్’ (Exit Plan) సిద్ధం చేయండి” అని ట్రంప్ టీమ్ ఆయనపై ఒత్తిడి తెస్తోంది.

ఇజ్రాయెల్ భయం: పరిస్థితి తలకిందులు!
సాధారణంగా ఇజ్రాయెల్ ఏం చెబితే అమెరికా అది వింటుందనేది జగమెరిగిన సత్యం. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది! ఇరాన్ ఎదురుదాడులు మరియు ప్రాంతీయ సంక్షోభం కారణంగా, ఇజ్రాయెలే ఇప్పుడు “ఎలాగైనా ఈ యుద్ధాన్ని ఆపడానికి మార్గం ఉందా?” అని ‘ఎగ్జిట్ రాంప్’ (Exit Ramp) కోసం వెతుకుతోంది.

“మేము అనుకున్నది ఒకటి.. ఇక్కడ జరుగుతోంది మరొకటి!” అన్నది ఇజ్రాయెల్ ప్రస్తుత పరిస్థితి. ఇరాన్‌ను అణచివేయాలని ప్లాన్ చేసిన ఇజ్రాయెల్, ఇప్పుడు ఒక పెద్ద ‘సుడిగుండం’లో చిక్కుకుంది. ఇరాన్ వేస్తున్న ప్రతి అడుగు ఇజ్రాయెల్‌ను అతలాకుతలం చేస్తోంది.

‘FAFO’ అంటే ఏమిటో అర్థమైందా?
ఇంటర్నెట్‌లో ‘FAFO’ (Fuck Around and Find Out) అనే పదం ఉంది. అంటే “తెలిసీ తెలియక ఏదో ఒకటి చేసి, దాని తీవ్రమైన పరిణామాలను అనుభవించడం”. ఇజ్రాయెల్ ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితిలో ఉంది.

మొదట్లో ట్రంప్ “ఈ యుద్ధాన్ని త్వరగా ముగిస్తాను” అని చెప్పినప్పుడు, ఆయన ఇరాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఇజ్రాయెలే ఈ యుద్ధంతో తీవ్ర భయాందోళనలో (Panic) ఉంది. అందుకే వారి అభ్యర్థన మేరకే ట్రంప్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు.

రిమోట్ కంట్రోల్ ఇరాన్ చేతిలో!
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే… ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలా వద్దా అని నిర్ణయించే అధికారం ఇజ్రాయెల్ లేదా అమెరికా చేతుల్లో లేదు. ఆ కాలం చెల్లిపోయింది. ఆ ‘రిమోట్ కంట్రోల్’ ఇప్పుడు ఇరాన్ రాజధాని టెహ్రాన్ వద్ద ఉంది. “అమెరికా దళాలు మధ్యప్రాచ్య ప్రాంతాన్ని విడిచి వెళ్లే వరకు మేము విశ్రమించం” అని ఇరాన్ స్పష్టం చేస్తోంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఇరాన్ మాత్రమే నిర్ణయించగలదు.

మొత్తానికి, మెరుపు దాడితో ఇరాన్‌ను దెబ్బతీయాలనుకున్న ఇజ్రాయెల్, ఇప్పుడు తన ఉనికికే ప్రమాదం ఏర్పడేలా ఒక మహా యుద్ధంలో చిక్కుకుంది.


Posted

in

by

Tags: