ఇరానియన్ రియల్: నిన్నటి వరకు ఇరాన్ అమెరికాను బలంగా ఢీకొంటుందని అందరూ భావించారు. కానీ వారి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణంతో, ఇరాన్ ఇంకా ఎన్ని రోజులు ఈ యుద్ధ భారాన్ని మోయగలదు అనేది ఇప్పుడు అసలు ప్రశ్న.
గత కొన్ని రోజులుగా ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు మన 100 రూపాయలతో ఇరాన్లో ఏమేమి కొనుగోలు చేయవచ్చో చూద్దాం.
నిన్నటి నుండి ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపించాయి. ఇరాన్ కూడా దీనికి దీటుగా సమాధానం ఇచ్చింది. పొరుగున ఉన్న ఎనిమిది దేశాల్లోని అమెరికా సైనిక, నౌకాదళ స్థావరాలపై క్షిపణులను ప్రయోగించింది. ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఇరాన్ తీవ్రస్థాయిలో దాడులు చేసింది.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ కొత్త ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు మరియు కరెన్సీ విలువలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇరాన్‌లోని చమురు నిల్వలపై నియంత్రణ సాధించడమే అమెరికా లక్ష్యమని, అందుకే ఇజ్రాయెల్ సహాయంతో ఈ దాడులు చేస్తున్నారని ఒక వాదన వినిపిస్తోంది. అయితే, దీనివల్ల ఇరాన్ కరెన్సీ విలువ భారీగా పడిపోయింది.
భారత రూపాయి విలువ – ఇరాన్ రియల్:
ఇరాన్ అధికారిక కరెన్సీ ఇరానియన్ రియల్. యుద్ధ మేఘాలు కమ్ముకోవడం మరియు ఆ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల రియల్ విలువ ప్రపంచ మార్కెట్లో గణనీయంగా పడిపోయింది. దీనివల్ల ఇరాన్లో భారత రూపాయికి విలువ పెరిగింది.
మార్చి 2026 తాజా మార్పిడి రేటు ప్రకారం:
- 1 భారత రూపాయి = సుమారు 14,434 ఇరానియన్ రియల్స్.
- 100 భారత రూపాయలు = సుమారు 14,43,430 ఇరానియన్ రియల్స్.
అంటే మన దగ్గర ఉన్న రూ. 100 అక్కడ రూ. 14 లక్షల రియల్స్‌తో సమానం. అయితే ఈ రేటు రోజువారీ మారుతూ ఉంటుంది.
100 రూపాయలతో ఇరాన్లో ఏమి కొనవచ్చు?
ఇరాన్లో ధరలను భారత రూపాయల్లోకి మార్చి చూస్తే:
- పాలు: 1 లీటర్ పాలు సుమారు 5,00,000 రియల్స్ అంటే భారత కరెన్సీలో రూ. 35.
- గుడ్లు: 1 డజన్ గుడ్లు సుమారు 7-8 లక్షల రియల్స్ అంటే సుమారు రూ. 50 నుండి 55.
- బ్రెడ్ (పావ్): ఒక బ్రెడ్ ప్యాకెట్ 1,50,000 రియల్స్ అంటే కేవలం రూ. 10.
- పెట్రోల్: ఇరాన్లో 1 లీటర్ పెట్రోల్ ధర భారత కరెన్సీలో రూ. 10 కన్నా తక్కువే.

Leave a Reply