ఇరాన్ యుద్ధం: మళ్లీ ప్రారంభమైన విమాన సేవలు… కానీ అందులోనూ ఒక ట్విస్ట్!

అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేయడంతో గల్ఫ్ దేశాల గగనతలం (Airspace) మూతపడింది. దీనివల్ల వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి లేదా దారి మళ్లించబడ్డాయి. ఈ విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

అమెరికా – ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్.. యూఏఈ (UAE), ఖతార్, కువైట్ మరియు సౌదీ అరేబియాపై ఎదురుదాడికి దిగింది. ఈ యుద్ధ వాతావరణం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం నుండి గల్ఫ్ దేశాలు పరిమిత సంఖ్యలో విమాన సేవలను ప్రారంభించాయి.

మళ్లీ ప్రారంభమైన సేవలు
  • ఎమిరేట్స్ (Emirates): ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. విమాన ప్రయాణం ఖరారైనట్లు సమాచారం అందితేనే విమానాశ్రయానికి రావాలని ప్రయాణికులను కోరింది.
  • ఎతిహాద్ (Etihad): వాణిజ్య విమానాలు రద్దయినప్పటికీ, అబుదాబి నుండి పరిమితంగా సేవలను ప్రారంభించింది. భద్రతా అనుమతులకు లోబడి కొన్ని సరుకు రవాణా మరియు స్వదేశానికి వెళ్లే విమానాలను నడుపుతున్నట్లు పేర్కొంది.
  • ఫ్లై దుబాయ్ (flydubai): మార్చి 2 సాయంత్రం నుండి పరిమిత సేవలను నడుపుతోంది. ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చే ముందు ‘Manage Your Booking’ ద్వారా తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించింది.
  • ఎయిర్ అరేబియా (Air Arabia): నేడు (మార్చి 3) మధ్యాహ్నం 3 గంటల వరకు యూఏఈ విమానాలను నిలిపివేసింది. లెబనాన్, జోర్డాన్, సిరియా మరియు ఇరాక్ దేశాలకు మార్చి 4 వరకు సేవలు ఉండవు.
  • రాస్ అల్ ఖైమా విమానాశ్రయం: తదుపరి నోటీసు వచ్చేవరకు విమాన సేవలను పూర్తిగా నిలిపివేసింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు రావొద్దని సూచించింది.
  • దుబాయ్ & షార్జా విమానాశ్రయాలు: నిన్న సాయంత్రం నుండి దుబాయ్, నేటి నుండి షార్జా విమానాశ్రయాల్లో పరిమితంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా పాక్షికంగా సేవలు పునరుద్ధరించబడ్డాయి.

Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *