ఇరాన్ వేసిన స్కెచ్! హెలికాప్టర్ అనుకుని 3D పెయింటింగ్‌పై దాడి చేసిన ఇజ్రాయెల్?

ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) ఇటీవల కొన్ని వీడియోలను విడుదల చేసింది. అందులో ఒక వీడియోలో.. నేలపై ఉన్న ఒక ‘Mi-17’ రకపు హెలికాప్టర్‌ను క్షిపణితో అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు చూపించారు. అయితే, ఆ వీడియో చూసిన రక్షణ నిపుణులు అది అసలైన హెలికాప్టర్ కాదని, కేవలం ఒక ‘3D పెయింటింగ్’ (ఓవ్యం) అని చెబుతున్నారు.

శత్రువును తప్పుదోవ పట్టించే వ్యూహం (Decoys):
సాధారణంగా యుద్ధ సమయంలో శత్రు దేశాల డ్రోన్లు మరియు శాటిలైట్లను మోసం చేయడానికి ఇరాన్ ఒక వింత వ్యూహాన్ని అనుసరిస్తుంటుంది. అసలైన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లకు బదులుగా.. అదే పరిమాణంలో ఉండే చెక్క నమూనాలను లేదా నేలపై అచ్చం హెలికాప్టర్ లాగే కనిపించేలా 3D చిత్రాలను గీస్తుంది. క్షిపణి దాడికి ముందు ఆ హెలికాప్టర్ నీడ పడుతున్న తీరును గమనిస్తే, అది నేలపై ఉన్న ఒక ఫ్లాట్ పెయింటింగ్ లాగే కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

సైకలాజికల్ వార్ (Psychological Warfare):
“కోట్లాది రూపాయల విలువైన క్షిపణిని కేవలం కొన్ని డాలర్ల ఖర్చుతో గీసిన పెయింటింగ్‌పై వేస్ట్ చేసేలా చేశాం” అంటూ ఇరాన్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తున్నారు. అయితే, మార్చి 2026 ఆరంభంలో ఇజ్రాయెల్-అమెరికా జరిపిన భారీ దాడుల్లో ఇరాన్ యొక్క 80% వాయు రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఈ “పెయింటింగ్ హెలికాప్టర్” వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసింది.


Posted

in

by

Tags: