పాకిస్థాన్‌లో ఇరాన్‌తో శాంతి చర్చలు జరగవచ్చనే వార్తలను అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కొట్టిపారేశారు. వీటిని ఆమె కేవలం “ఊహాగానాలు” (Speculation) అని అభివర్ణించారు.
గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన లీవిట్, వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించే వరకు దేనినీ నిర్ధారించలేమని చెప్పారు. “నేను కూడా ఆ ఊహాగానాలను చూశాను. కానీ వైట్ హౌస్ నుండి ప్రకటన వచ్చే వరకు ఏదీ అధికారికం కాదు” అని ఆమె స్పష్టం చేశారు.
ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ పాత్రపై: ఇరాన్ యుద్ధంలో ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ క్రియాశీల భాగస్వామి కావడంతో ఇప్పుడేం మారిందని ప్రశ్నించగా.. ఆయన ఎప్పుడూ క్రియాశీలకంగానే ఉన్నారని లీవిట్ సమాధానమిచ్చారు. “ఏమీ మారలేదు. ఉపాధ్యక్షుడు ఎల్లప్పుడూ జాతీయ భద్రతా బృందంలో కీలక సభ్యుడు మరియు అధ్యక్షుడికి కుడిభుజం వంటి వారు. గతంలో 12 రోజుల యుద్ధ చర్చలు మరియు గాజాలో కాల్పుల విరమణలో ఆయన పాత్ర ఎంతో ఉంది” అని ఆమె పేర్కొన్నారు.
అయితే, ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరియు అధ్యక్షుడి అల్లుడు జారెడ్ కుష్నర్లతో చర్చలు జరపడానికి ఇరాన్ సుముఖంగా లేదని, వారు కేవలం ఉపాధ్యక్షుడు వాన్స్తోనే చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు CNN నివేదించింది.
ఇతర ముఖ్యాంశాలు:
- అమెరికా అధ్యక్షుడికి ‘పెద్ద కానుక’: హార్ముజ్ జలసంధి గుండా వచ్చిన 20 లక్షల బారెళ్ల చమురు ట్యాంకర్ గురించి అడగ్గా, “దీనిపై సరైన సమయంలో అధ్యక్షుడే మాట్లాడతారు” అని లీవిట్ దాటవేశారు.
- ఇరాక్ దాడిపై: ఏడుగురు సైనికులు మరణించిన సైనిక క్లినిక్ దాడికి అమెరికా బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించగా.. దీనిపై పెంటగాన్‌తో మాట్లాడి వివరాలు చెబుతానని ఆమె తెలిపారు.
- సైనిక మోహరింపు: మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగుస్తుందని స్పీకర్ జాన్సన్ చెబుతున్నా, 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ నుండి సుమారు 2,500 మంది సైనికులను అమెరికా అక్కడికి ఎందుకు పంపుతోందని అడగ్గా.. “మేము మా లక్ష్యాలను వేగంగా చేరుకుంటున్నాము. పెంటగాన్ ఎప్పుడూ అన్ని అవకాశాలను సిద్ధంగా ఉంచుకుంటుంది” అని ఆమె వివరించారు.
