ఈ ఘనకార్యం థార్ మాత్రమే చేయగలదు.. నేరుగా సైన్ బోర్డులోకి దూసుకెళ్లింది! వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఏంటి?

NH 48 థార్ ప్రమాదం వైరల్ వీడియో: ఢిల్లీ-గురుగ్రామ్-జైపూర్ జాతీయ రహదారి (NH-48) పై ఒక థార్ కారు రోడ్డు పక్కన ఉన్న పెద్ద సైన్ బోర్డును ఢీకొన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని కొందరు వాదిస్తుంటే, మరికొందరు ఇది ‘AI’ (కృత్రిమ మేధ) సృష్టించిన నకిలీ వీడియో అని కొట్టిపారేస్తున్నారు.

అసలు ఏం జరిగింది? వైరల్ అవుతున్న క్లిప్‌లో ఒక నల్లటి థార్ కారు అతివేగంగా వస్తూ అదుపుతప్పి, గాలిలోకి ఎగిరి రోడ్డు పక్కన ఉన్న భారీ సైన్ బోర్డు ఇనుప చట్రంలోకి దూసుకుపోవడం కనిపిస్తుంది. ఈ వీడియో ఢిల్లీ-జైపూర్ హైవేపై జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అటు పోలీసులు కానీ, ఇటు ప్రముఖ వార్తా సంస్థలు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సోషల్ మీడియాలో చర్చ: ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

  • ఒక యూజర్ ఇలా రాశారు: “ఇది AI తో రూపొందించిన వీడియో. జాగ్రత్తగా గమనిస్తే సైన్ బోర్డుపై ఎడమ పక్క ఇంగ్లీష్ ఉంది, కానీ కుడి పక్క ఉన్న భాష ఏంటో అర్థం కావడం లేదు. ఇది ఫేక్.”
  • మరో యూజర్ స్పందిస్తూ: “వీడియో నిజమో కాదో పక్కన పెడితే, రోడ్డుపై చిన్న అజాగ్రత్త కూడా ప్రాణాల మీదకు తెస్తుంది” అని హెచ్చరించారు.

Posted

in

by

Tags: