మాంసాహారులు చికెన్, మటన్ లేదా చేపలను వారానికి ఒకసారైనా తింటుంటారు. ఇటీవల చికెన్ లివర్ మరియు మటన్ లివర్ తినేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ రెండూ కూడా అధిక పోషక విలువలు కలిగిన ఆహారాలే. అయితే, ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఉత్తమం మరియు ఏది తింటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
చికెన్ లివర్: చికెన్ లివర్ తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ (ఇనుము), సెలీనియం, విటమిన్ ఏ, బి12, ఫోలేట్ మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ ఏ మరియు బి12 కంటి చూపును, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉడికించిన లివర్ తినడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది.
మటన్ లివర్: చాలా మంది చికెన్ లివర్ కంటే మటన్ లివర్ తినడానికి ఇష్టపడతారు. మటన్‌లో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది దీనిని ముందుగా ఉడికించి వాడుతుంటారు. ఇందులో విటమిన్ ఏ, డి, బి12, జింక్, పొటాషియం మరియు రాగి వంటి పోషకాలు ఉన్నాయి. దీనిని తినడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది.
ఎవరికి మంచిది? శరీరంలో రక్తం తక్కువగా ఉండి రక్తహీనతతో బాధపడేవారికి మటన్ లివర్ ఒక అద్భుతమైన ఆహారం. ఇందులోని విటమిన్ బి12 రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.
ఎవరు తినకూడదు? కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మరియు గర్భిణీ స్త్రీలు చికెన్ లేదా మటన్ లివర్‌ను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
