టోక్యో: సోమవారం ఉత్తర జపాన్లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది. ఈ నేపథ్యంలో, సముద్ర తీర ప్రాంతాల్లో మూడు మీటర్ల (10 అడుగులు) ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తర ఇవాటే ప్రిఫెక్చర్ సమీపంలోని పసిఫిక్ సముద్ర తీరంలో సాయంత్రం 4:53 గంటలకు (0753 GMT) భూకంపం సంభవించింది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోలోని భారీ భవనాలు కూడా ఈ ప్రకంపనల ధాటికి కంపించాయి.
మరోవైపు, ఆదివారం పశ్చిమ ఇండోనేషియాలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపంలోని నియాస్ ప్రాంతానికి వాయువ్యంగా 48 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు ఇండోనేషియా వాతావరణ సంస్థ తెలిపింది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ (Pacific Ring of Fire) ప్రాంతంలో ఉండటం వల్ల ఇండోనేషియాలో తరచుగా భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.
