ఇంటి లక్ష్మీకటాక్షం, సంతోషం నిలిచి ఉండే అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా వంటగది పరిగణించబడుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగది అనేది కేవలం ఆహారం వండే ప్రదేశం మాత్రమే కాదు; అది ఇంటి సంపదను, ఆరోగ్యాన్ని నిర్ణయించే ప్రధాన కేంద్రం. ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణా దేవి అనుగ్రహం, పంచభూతాలలో ఒకటైన శక్తివంతమైన అగ్నిదేవుడి శక్తి నిండి ఉండే ఈ ప్రదేశాన్ని నిర్వహించే పద్ధతిలోనే ఇంటి మేలు ఆధారపడి ఉంది.
ఉదయం వేళను సానుకూల శక్తితో ప్రారంభించడం ఇంటి సమృద్ధికి చాలా అవసరం. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం, ఉదయాన్నే వంట చేయడం ప్రారంభించే ముందు వంటగదిని సరిగ్గా శుభ్రం చేయడం ఇంటి దారిద్ర్యాన్ తొలగించి శుభాలను తెస్తుంది. అయితే, చాలామంది వంటగదిని శుభ్రం చేసేటప్పుడు సరైన క్రమాన్ని అనుసరించరు; ఇది తెలియక చేసే వాస్తు దోషానికి దారితీస్తుంది.
వంటగదిని శుభ్రం చేయడానికి ఒక నిర్దిష్ట పద్ధతిని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. దాని ప్రకారం, ఉదయాన్నే వంట ప్రారంభించడానికి ముందు మొదటగా అగ్నిదేవుడు కొలువ ఉండే ‘గ్యాస్ పొయ్యి’ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత వంట గట్టును (Slab) తుడవాలి. ఈ రెండింటినీ పూర్తి చేసిన తర్వాత మాత్రమే చివరగా పాత్రలు కడిగే ‘సింక్’ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి.
ఈ సరైన క్రమాన్ని అనుసరించి శుభ్రం చేయడం ద్వారా వంటగదిలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి, అన్నపూర్ణా దేవి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. తప్పుడు మార్గంలో శుభ్రం చేయడమో లేదా మురికిగా ఉన్న వంటగదిలో వంట ప్రారంభించడమో కుటుంబంలో అనవసర కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది కాబట్టి, ఈ సరళమైన వాస్తు నియమాన్ని రోజూ పాటించి ఇంట్లో సానుకూల శక్తిని, సంపదను పెంపొందించుకోండి.

Leave a Reply