ఎంతో ఇష్టపడి ప్రేమికుడిని పెళ్లాడిన టీచర్..! “పెళ్లయినా సరే భర్తను వదిలేయమంటూ టార్చర్”..? తాళం వేసిన గదిలో శవమై తేలిన వివాహిత.. భర్త స్నేహితుడు వెల్లడించిన భయానక నిజాలు!

బిహార్‌లోని వైశాలి జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మధుపాల్ అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాకు చెందిన మధుపాల్ (27), టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. పాఠశాల సమీపంలోనే అద్దె ఇంట్లో నివసిస్తున్న ఆమె, దాదాపు మూడు నెలల క్రితం కన్నౌజ్ జిల్లాకు చెందిన గౌరవ్ కుమార్ పాల్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.

రక్షాబంధన్ పండుగ సందర్భంగా మధుపాల్ తన భర్తతో కలిసి కాన్పూర్‌కు వెళ్లారు. అనంతరం పుట్టింటి నుంచి ఆమె తిరిగి బిహార్‌లోని విధులకు చేరుకున్నారు. ఆగస్టు 29న యథావిధిగా పాఠశాలకు వెళ్లి విధులు ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సాయంత్రం సమయంలో భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధుపాల్ లిఫ్ట్ చేయకపోవడంతో, ఆయన అద్దె ఇంటి యజమానికి సమాచారం అందించారు.

దీంతో ఇంటి యజమాని వెళ్లి చూడగా లోపలి నుంచి గది తాళం వేసి ఉండటాన్ని గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా, మధుపాల్ విగతజీవిగా పడి ఉంది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. అనంతరం ఆ గదికి సీల్ వేసిన పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.

మధుపాల్ ప్రేమ వివాహాన్ని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారని, పెళ్లయిన తర్వాత కూడా భర్త గౌరవ్‌ను వదిలేసి రావాలంటూ ఆమెపై నిరంతరం ఒత్తిడి తెచ్చారని గౌరవ్ స్నేహితుడు అజిత్ పాల్ ఆరోపించారు. అంతేకాకుండా, గౌరవ్‌ను విడిచిపెట్టి వేరే పెళ్లి చేసుకోవాలని ఆమె కుటుంబం ఒత్తిడి చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఆమె భర్త స్నేహితుడు చేసిన ఆరోపణలుగానే ఉన్నాయి. మరోవైపు, మధుపాల్ విద్యార్థులతో, తోటి ఉపాధ్యాయులతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక మరియు పోలీసుల సమగ్ర దర్యాప్తు తర్వాతే ఈ మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *