మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు కావాలనే కారణంతో, ఒక యువకుడు ఏకంగా తన ప్రియురాలి ఇంట్లోనే సుమారు ₹1.10 కోట్ల విలువైన సొత్తును దోచుకున్నాడు.
ఎలాగైనా గ్రామ సర్పంచ్ కావాలనే ఆశతోనే అతడు ఈ దొంగతనానికి పాల్పడినట్లు జాతీయ మీడియా ‘ఆజ్ తక్’ వెల్లడించింది. దొంగిలించబడిన వస్తువులలో బంగారు బిస్కెట్లు, భారీగా నగదుతో పాటు ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఖరీదైన ‘iPhone 17’ కూడా ఉన్నట్లు సమాచారం. ఒకే ఇంటి నుండి ఇంత భారీ మొత్తంలో (₹1.10 కోట్లు) చోరీ జరగడం ఇండోర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఎన్నికల్లో పోటీ చేయాలనే పిచ్చితో కట్టుకోబోయే అమ్మాయి ఇంట్లోనే కన్నం వేసిన ఆ యువకుడి తీరు చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, దొంగతనం కచ్చితంగా ఎలా జరిగింది? చోరీకి గురైన సొత్తును రికవరీ చేశారా? నిందితుడిని అరెస్టు చేశారా? అనే విషయాలపై పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Leave a Reply