ప్రకృతి ప్రసాదించిన పండ్లు, ఔషధ గుణాలు కలిగిన ఆహారానికి నేటి కాలంలో ప్రాధాన్యత పెరిగింది. అందులో ఎర్ర అరటి (Red Banana) ఒక గొప్ప వరప్రసాదం. సాధారణ అరటిపండ్ల కంటే ఇందులో పోషకాలు చాలా ఎక్కువ. విటమిన్ సి, ఐరన్, పొటాషియం, బీటా కెరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
నరాల బలం: వైద్య పరిశోధనల ప్రకారం, రోజుకు రెండు ఎర్ర అరటిపండ్లను 48 రోజుల పాటు తింటే శరీర బలహీనత తగ్గి, నరాల వ్యవస్థ బలోపేతం అవుతుంది.
గుండె ఆరోగ్యం: ఇది రక్త ప్రసరణను సీరు చేయడమే కాకుండా, రక్తపోటును (Blood Pressure) 7 mm Hg వరకు తగ్గించగలదు.
నివారణ: కిడ్నీలో రాళ్లు, కాలేయంలోని విషతుల్యాలు మరియు శరీరంలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
సంతాన సాఫల్యం: సంతానం లేని దంపతులకు ఇది ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ B6 మరియు యాంటీ ఆక్సిడెంట్లు మహిళల గర్భాశయాన్ని బలోపేతం చేసి, సంతాన అవకాశాలను మెరుగుపరుస్తాయి.
జీర్ణక్రియ: ఇది ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. తద్వారా మలబద్ధకం మరియు పైల్స్ (మొలలు) వంటి సమస్యలు తగ్గుతాయి.
చర్మం మరియు జుట్టు సంరక్షణ:
ఎర్ర అరటిలో 75% నీటి శాతం ఉంటుంది, ఇది చర్మానికి తేమను అందించి మెరిసేలా చేస్తుంది. జుట్టు ఆరోగ్యం కోసం దీనిని కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో కలిపి ప్యాక్లా వేసుకుంటే జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి.
కంటి చూపు మరియు పంటి సమస్యలు:
కంటి చూపు: రేచీకటి ఉన్నవారు 40 రోజుల పాటు దీనిని తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ కంటి వ్యాధులను అడ్డుకుంటుంది.
పంటి బలం: 21 రోజుల పాటు వరుసగా ఎర్ర అరటిని తింటే, కదులుతున్న పళ్లు కూడా చిగుళ్లలో బలంగా పట్టుకుంటాయి.
