యూపీఐ (UPI) డిజిటల్ నగదు లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ప్రజల్లో నెలకొన్న సందేహాలకు, వ్యాప్తి చెందుతున్న వదంతులకు ముగింపు పలికేలా ఆమె ఈ వివరణ ఇచ్చారు.
యూపీఐ లావాదేవీల కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి కొత్త పన్ను వసూలు చేయడం లేదని ఆమె పేర్కొన్నారు. నగదు బదిలీ చేసే మొత్తం ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, దానికోసం వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయడం లేదని గుర్తుచేశారు.
ప్రజలు తాము కొనుగోలు చేసే వస్తువులకు సంబంధించిన అసలు ధరను మాత్రమే చెల్లిస్తున్నారని, ఇందులో ఎలాంటి రహస్య (పరోక్ష) ఛార్జీలు లేవని ఆమె తేల్చి చెప్పారు. ఆర్థిక మంత్రి చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండటంతో పాటు, డిజిటల్ చెల్లింపులు జరిపే వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చింది.

Leave a Reply