సెలూన్ షాపుకు వచ్చిన బ్లాక్ చెక్స్ (నల్ల గళ్ల) టీ-షర్ట్ ధరించిన ఓ బాలుడు చేసిన షాకింగ్ చోరీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదలై పెను కలకలం రేపుతోంది.
ఆ బాలుడు షాపులోకి ప్రవేశించి చాలా సాధారణంగా అటూ ఇటూ తిరుగుతూ, అక్కడున్న వారి దృష్టిని మళ్లించి తన చేతివాటాన్ని అత్యంత చాకచక్యంగా ప్రదర్శించాడు. అతను ఎప్పుడు, ఎలా వస్తువును దొంగిలించి మాయం చేశాడనేది అక్కడున్న వారు వెంటనే కనిపెట్టలేకపోయారు.
ఇలాంటి తెలివైన దొంగలు ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, అందరి కళ్లముందే కనురెప్ప పాటులో దొంగతనం చేసి పరారవుతుంటారు.
ఈ బాలుడి చాకచక్యమైన చోరీ లీలలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ సీసీటీవీ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘షాపుల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి’ అని తెలియజేసేలా నెటిజన్లు పలువురు ఈ వీడియోను షేర్ చేస్తూ హెచ్చరిస్తున్నారు.

Leave a Reply