“ఎవరికీ చెప్పొద్దు.. ఫోటోలు లీక్ చేస్తాం!” 15 ఏళ్ల బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ఐదుగురు! బెదిరించి భయపెట్టిన ముఠా.. చివరికి ఎదురైన ట్విస్ట్.!

మహారాష్ట్రలోని ముంబై పొవాయ్ ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

అక్టోబర్ 27, 28 తేదీల మధ్య ఈ ఘటనలు జరిగినట్లు సమాచారం. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడగా, మరొక వ్యక్తి విడిగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

సాకి విహార్ రోడ్డులోని ఓ బేకరీ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి బాలికను తీసుకెళ్లిన ఐదుగురు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో పొవాయ్ ప్రాంతంలోని పైప్‌లైన్ వద్ద మరో వ్యక్తి బాలికను అడ్డగించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. వరుసగా జరిగిన ఈ ఘటనలతో బాలిక తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత, జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని, బయట చెబితే బాలిక ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తామని నిందితులు బెదిరించారు. దీంతో భయపడిన బాలిక, జరిగిన విషయాన్ని వెంటనే బయటపెట్టలేదు. ఆ తర్వాత అక్టోబర్ 29వ తేదీ ఉదయం తన కుటుంబ సభ్యులకు జరిగిన ఘోరాన్ని వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు బాలికను వెంటబెట్టుకుని పొవాయ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

దీని ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 64(1), 74, మరియు పోక్సో చట్టం సెక్షన్లు 4, 8, 12 కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ చేపట్టిన పోలీసులు, ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఆరుగురినీ అరెస్టు చేశారు. వారిలో ఐదుగురు లైంగిక దాడికి పాల్పడగా, మరొకరు విడిగా లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించిన వారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ముంబైలోని కేఈఎం ఆసుపత్రికి తరలించారు. అరెస్టయిన వారికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని తెలుస్తోంది. బాలికకు జరిగిన ఈ ఘోరం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.


Posted

in

by

Tags: