హర్యానాలోని పానిపట్ ప్రాంతంలో ప్రేమ వివాహం చేసుకున్న పూనమ్ (20) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఆమె భర్త విశు మరియు అత్తింటివారు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా శ్మశానవాటికలో రహస్యంగా మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు పోలీసులతో కలిసి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
కాలుతున్న చితిపై నుంచి పూనమ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, వెంటనే పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రేమ వివాహం తర్వాత కుటుంబంలో తలెత్తిన వివాదాల కారణంగా వీరిద్దరూ కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో 3 రోజుల క్రితం పూనమ్ విషం తాగి ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది.
అయితే, వరకట్న వేధింపులకు గురిచేసి తన సోదరిని హత్య చేశారని పూనమ్ సోదరుడు ఆరోపిస్తున్నాడు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే మరణానికి గల అసలు కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

Leave a Reply