“ఎస్.ఐ.ఆర్ (SIR) వ్యవహారంలో కొత్త భూకంపం!” రాష్ట్రపతిని కలిసేందుకు సిద్ధమవుతున్న ‘ఇండియా’ కూటమి ఎంపీలు..!!

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అయిన ఎస్.ఐ.ఆర్ (SIR) వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి ఎంపీలు భారీ ర్యాలీ చేపట్టారు.

పార్లమెంట్ ప్రాంగణం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలను ఢిల్లీ పోలీసులు బారికేడ్లు వేసి నడిరోడ్డుపై అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగడంతో, పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం పోలీసులు వారిని విడిచిపెట్టగా, నాయకులు తిరిగి ర్యాలీగా వెళ్లి ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి) కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు మరోసారి వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కాసేపటికి విడుదల చేశారు. అనుమతి లేకుండా రేడియో కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించినందుకు గాను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేసు నమోదు కాగా, ఈ మొత్తం వ్యవహారంపై భారత రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసేందుకు ఇండియా కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *