గ్రామానికి చెందిన ఓ బాలుడు తన తెలివితేటలు, సమయస్ఫూర్తితో విరిగిపోయిన హ్యాండ్‌పంప్‌ను తిరిగి పనిచేసేలా చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి ప్రతిభను చూసిన నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు ఎక్కువగా హ్యాండ్పంప్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఓ హ్యాండ్‌పంప్‌కు సంబంధించిన హ్యాండిల్ విరిగిపోవడంతో నీటిని తోడుకోలేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ సమయంలో ఆ బాలుడు తన సొంత ఆలోచనతో రంగంలోకి దిగాడు. ప్రత్యేకమైన పరికరాలు ఏవీ లేకుండానే.. చుట్టుపక్కల అందుబాటులో ఉన్న సాధారణ చెక్క కర్రలు, వైర్లను ఉపయోగించి విరిగిపోయిన హ్యాండిల్‌కు బదులుగా తాత్కాలిక హ్యాండిల్‌ను తయారు చేశాడు.
బాలుడు ఏర్పాటు చేసిన ఈ కొత్త వ్యవస్థతో హ్యాండ్‌పంప్‌ను మళ్లీ సులభంగా ఆపరేట్ చేయగలిగారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు కూడా సాఫీగా బయటకు వచ్చింది.
బాలుడి సమయస్ఫూర్తి, సృజనాత్మక ఆలోచన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
“అవసరం వచ్చినప్పుడే అసలైన సృజనాత్మకత బయటపడుతుంది” అంటూ ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు బాలుడి తెలివితేటలను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply