“ఏమిటీ చిరుతకు వచ్చిన కష్టం!”.. కుక్కలను చూసి వణికిపోయిన చిరుత చేసిన షాకింగ్ పని.. భయాందోళనలో స్థానికులు..!!

కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలోని జ్ఞానేశ్వరి కాంప్లెక్స్ నివాస ప్రాంతంలోకి ఒక చిరుతపులి చొరబడిన ఘటన ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

గత గురువారం ఉదయం ఆహారం వెతుక్కుంటూ వచ్చిన ఆ చిరుత, అక్కడున్న కోడిని వేటాడేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

దీన్ని గమనించిన స్థానిక కుక్కలు ఆపకుండా అరుస్తూ చిరుతను తరిమికొట్టాయి. దీంతో అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన చిరుత, పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కి దాక్కుంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

చిరుతను తరుముకొచ్చిన కుక్కలు చెట్టు కింద నిలబడి ఆపకుండా అరిచాయి. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు దగ్గరకు వెళ్లి చూడగా, కొబ్బరి చెట్టుపై చిరుత ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, అధికారులకు చిక్కకుండా అక్కడి నుంచి తప్పించుకున్న చిరుత, సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు సమాచారం.

నివాస ప్రాంతంలో చిరుత సంచారం ఉన్నట్లు తెలియడంతో, స్థానికులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకుని ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని స్థానికులు అటవీశాఖ అధికారులను కోరారు. దీంతో చిరుత కదలికలను నిశితంగా గమనిస్తూ, అది వచ్చే ప్రాంతంలో బోను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అలాగే, ప్రజలు ఒంటరిగా వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, చిరుతను చూస్తే దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *