చైనాలోని షాంఘై నగరంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనంలో, చూడటానికి ఎంతో భయాందోళన కలిగించేలా 3 మీటర్ల పొడవున్న అరుదైన ‘తెలుపు రంగు’ కొండచిలువ ప్రవేశించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఎయిర్ కండీషనర్ (ఏసీ) బయటి భాగంలో పాము ప్రాకుతుండటాన్ని చూసిన ప్రజలు, భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ మరియు ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది, తీవ్రంగా శ్రమించి ఆ తెల్లటి కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. నివాసితుల కేకల మధ్య ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది.
పట్టుబడిన ఆ పాము దాదాపు 15 కిలోల బరువున్న ‘అల్బినో బర్మీస్ పైథాన్’ (Albino Burmese Python) రకానికి చెందినది కావచ్చునని అటవీ శాఖ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పామును వెంటనే సురక్షితంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.
సాధారణ పాముల్లా కాకుండా, పూర్తిగా తెలుపు రంగులో కనిపించిన ఈ విచిత్రమైన పామును చూసి ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యంతో పాటు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన ఈ తెల్లటి కొండచిలువను ఫైర్ సిబ్బంది కష్టపడి పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్లను భయపెడుతోంది.

Leave a Reply