ఐసీయూలో రోగుల చివరి మాటలేమిటి? మరణం గురించి ముందే తెలిసిపోతుందా? నర్సు బయటపెట్టిన పెద్ద రహస్యం!

మరణం అనేది శాశ్వత సత్యం. చనిపోయే వ్యక్తి మనసులో ఏం జరుగుతుందో, ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఆ వ్యక్తికే తెలియాలి. కానీ, కొన్నిసార్లు ఆసుపత్రిలోని డాక్టర్లకు లేదా నర్సులకు ఈ విషయం ముందే అర్థమవుతుంది. తాజాగా ఐసీయూలో పనిచేసే ఒక నర్సు దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించింది.

ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ.. తాను చాలా మంది రోగుల చివరి మాటలను విన్నానని తెలిపింది. అంతేకాదు, తాము చనిపోబోతున్నామనే విషయం రోగులకు ముందే తెలిసిపోతుందని ఆమె పేర్కొంది. ఆమె వెల్లడించిన ఈ విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

నర్సు ఏం చెప్పింది? న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, కర్స్టీ రాబ్ అనే మహిళ ఐసీయూ నర్సుగా పనిచేస్తున్నారు. గత నాలుగేళ్లుగా తాను ఐసీయూలో ఎంతోమంది మరణాలను దగ్గరుండి చూశానని ఆమె తెలిపారు. చనిపోయే ప్రతి వ్యక్తి దాదాపు ఒకే రకమైన మాటలు చెబుతారని ఆమె అన్నారు. “నేను నా కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో వారికి చెప్పండి. నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది, నేను చనిపోబోతున్నానని నాకు తెలుస్తోంది” అని రోగులు తరచుగా చెబుతుంటారని ఆమె వివరించారు.

మరణం ముందే తెలుస్తుందా? రోగుల శరీరంలోని అన్ని అవయవాలు (Vitals) సాధారణంగానే ఉన్నప్పటికీ, ప్రాణాపాయం కలిగించే పెద్ద మార్పులేవీ కనిపించకపోయినప్పటికీ.. రోగికి మాత్రం తాను చనిపోతాననే అంతర్లీన భావన కలుగుతుందని ఆమె చెప్పారు. రోగికి అలా అనిపించిన తర్వాత వారికి ఎలాంటి మందులు ఇచ్చినా, ఎంత గొప్ప చికిత్స చేసినా ఫలితం ఉండదని, వారు మరణిస్తారని ఆమె పేర్కొన్నారు. దీని వెనుక ఏదో ఆధ్యాత్మిక కోణం ఉండి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

జీవితం గురించి గొప్ప సందేశం: ఈ విషయాలు చెబుతూ కర్స్టీ ఎమోషనల్ అయ్యారు. ప్రజలు తమ జీవితాలను వృథా చేసుకోవడం ఆపి, నిజంగా విలువైన విషయాలపై దృష్టి పెట్టాలని ఆమె సలహా ఇచ్చారు. అనవసరమైన విషయాల కోసం పాకులాడుతూ జీవితాన్ని గడపవద్దని, ప్రాముఖ్యత ఉన్న వాటికే సమయం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి మద్దతు పొందుతోంది.


Posted

in

by

Tags: