వైద్యుల్లో రకరకాల స్పెషలిస్టులు ఉంటారు, కానీ ‘రొమాన్స్ థెరపిస్ట్’ గురించి విన్నారా? ప్రస్తుతం కాలి మిల్లర్ (Kaly Miller) అనే మహిళ వార్తల్లో నిలుస్తోంది. ఒంటరితనంతో కుమిలిపోయే లేదా సరైన అనుబంధాన్ని ఏర్పరచుకోలేని పురుషులకు ఆమె శిక్షణ ఇస్తుంది. ఈ క్రమంలో ఆమె సుమారు 400 మంది పురుషులతో సన్నిహితంగా ఉన్నట్లు స్వయంగా వెల్లడించింది.
ఎవరీ కాలి మిల్లర్? యూనీలాడ్ (UNILAD) నివేదిక ప్రకారం, కాలి మిల్లర్ ఒక ‘సెక్స్ సర్రోగేట్’. వీరు వ్యభిచారం చేసే వారి కంటే భిన్నంగా ఉంటారు. కేవలం శారీరక వాంఛ తీర్చడం వీరి లక్ష్యం కాదు. తన క్లయింట్స్ (బాధితులు) పడుతున్న మానసిక ఇబ్బందులను అర్థం చేసుకోవడం, వారితో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, సాన్నిహిత్యం (Intimacy) పట్ల వారికి ఉన్న భయాందోళనలను పోగొట్టడం వీరి వృత్తి.
ఈ వృత్తిలోకి ఎలా వచ్చారు? కాలి మొదట స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్గా పనిచేసేవారు. సైకోసెక్సువాలిటీ (Psychosexuality) గురించి చదివిన ఆమె, మానవ భావోద్వేగాల గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి పత్రికలో ప్రకటన చూసి ఈ రంగంలోకి ప్రవేశించారు. తన మొదటి క్లయింట్ గురించి ఆమె ఒక హృదయ విదారక విషయాన్ని పంచుకున్నారు. 60 ఏళ్లు పైబడిన ఆ వ్యక్తి చాలా సిగ్గరి. జీవితంలో ఎప్పుడూ ఒక మహిళా స్పర్శను లేదా ప్రేమను అనుభవించలేదు. “కనీసం ఒక్కసారైనా నిజమైన ప్రేమను అనుభవించకుండా చావకూడదని అనుకుంటున్నాను” అని అతను చెప్పిన మాటలు ఆమెను కదిలించాయి. అప్పటి నుండి ఇది తన జీవిత లక్ష్యమని ఆమె భావించారు.
ప్రస్తుతం ఆమె కుటుంబం కూడా ఈ వృత్తిని అర్థం చేసుకుని మద్దతు ఇస్తోంది. 400 మందితో పనిచేసినా, ఆమె వ్యక్తిగత జీవితం మరియు ఇతర సంబంధాలు కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు.
