“ఒకానొక సమయంలో కిలో రూ. 30 లక్షలు పలికిన అరుదైన మూలిక ఇప్పుడు రూపాయికి కూడా పనికిరాకుండా పోయిందా..?” హిమాలయన్ వియాగ్రా ‘యార్సాగుంబా’కు పట్టిన దుస్థితి… జీవనోపాధిని కోల్పోయి తల్లడిల్లుతున్న నేపాల్ ప్రజలు..!!

‘హిమాలయాస్ వియాగ్రా’ (Himalayan Viagra) అని పిలిచే ‘యార్సాగుంబా’ (Yarsagumba) అనే అరుదైన మూలికా పుట్టగొడుగు, నేపాల్‌లోని పర్వత ప్రాంత ప్రజలకు సుదీర్ఘకాలంగా ప్రధాన జీవనోపాధిగా ఉండేది.

ఒకప్పుడు కిలో రూ. 30 లక్షల వరకు అమ్ముడైన ఈ మూలికకు, ప్రస్తుతం తగినంత మంది కొనుగోలుదారులు లేకపోవడంతో కనీస ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ మూలికను సేకరించే నేపాల్ రైతులు, ఇప్పుడు చాలా తక్కువ ఆదాయం మాత్రమే వస్తుండటంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో తమ జీవనోపాధి కోసం వారు ఇతర పనుల అన్వేషణలో భారతదేశానికి వలస రావడం ప్రారంభించారు.

మార్కెట్‌లో అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం, వాతావరణ మార్పుల వల్ల యార్సాగుంబా మూలిక నాణ్యత తగ్గడమే దీనికి ప్రధాన కారణాలు. భూతాపం (గ్లోబల్ వార్మింగ్) కారణంగా సరైన పెరుగుదల లేని మూలికలు మాత్రమే ఎక్కువ మొత్తంలో లభిస్తుండటంతో, మార్కెట్‌లో వాటికి తగిన ధర లభించడం లేదు.

నేపాల్‌లోని ముగు (Mugu) జిల్లాలోని పర్వత ప్రాంతాలలో గతేడాది కిలో యార్సాగుంబా రూ. 18 లక్షలకు అమ్ముడైంది. కానీ, ఈ ఏడాది అటవీ శాఖ ద్వారా కేవలం 10 కిలోల మూలికకు మాత్రమే విక్రయ అనుమతులు (సర్టిఫికెట్లు) మంజూరు అయ్యాయి.

దాదాపు 4,000 మందికి పైగా స్థానిక ప్రజలు ప్రాణాలకు తెగించి ఈ మూలికను సేకరిస్తుండగా, ప్రస్తుతం ఏర్పడిన ఈ క్షీణత నేపాల్ గ్రామీణ ప్రజల జీవనోపాధిని, అక్కడ స్థానిక ప్రభుత్వాల (పంచాయతీల) ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *