భారత జట్టు యువ స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ త్వరలోనే సొంతంగా ఒక క్లాథింగ్ (దుస్తుల) బ్రాండ్‌ను ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అధికారికంగా వెల్లడించారు. క్రికెట్ మైదానంలో అద్భుతమైన బ్యాటింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జైస్వాల్, ఇప్పుడు వ్యాపారవేత్తగా సరికొత్త అవతారం ఎత్తారు.
ఆయన ప్రారంభించబోయే ఈ కొత్త బ్రాండ్‌కు ‘YBJ Fits’ అని పేరు పెట్టారు. ఈ బ్రాండ్ ద్వారా దుస్తులతో పాటు వివిధ రకాల బ్యాగులను మార్కెట్లోకి తీసుకురానున్నారు. జైస్వాల్ ఇప్పటికే దీని అధికారిక లోగోను ఖరారు చేయడమే కాకుండా, తన బ్రాండ్ త్వరలోనే అందుబాటులోకి రానుందని అభిమానులతో పంచుకున్నారు.
ఈ ‘YBJ Fits’ బ్రాండ్ కోసం ప్రత్యేకంగా ఒక ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ప్రారంభించారు. అందులో వారు విక్రయించబోయే ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను పంచుకుంటున్నారు. తొలి దశలో టీ-షర్టులు, ప్రయాణాలకు ఉపయోగపడే లగేజ్ బ్యాగులు, ట్రావెల్ బ్యాగుల ఫోటోలను ఆ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.

Leave a Reply