ఒకే ఒక్క నిమిషం.. చేజారిన వైద్యురాలవ్వాలనే కల! నిబంధనలు ముఖ్యమా? ఒక అమ్మాయి జీవితం ముఖ్యమా?.. పరీక్షా కేంద్రం గేటు వద్ద మోకాళ్లపై పడి ఏడ్చిన తండ్రి హృదయవిదారక వీడియో..!!!

“ఇలాంటి పరిస్థితి లోకంలో ఏ తండ్రికీ రాకూడదు దేవుడా…” – గుండెల్ని పిండేసే ఈ విషాదకర సంఘటన నీట్ (NEET) పరీక్షా కేంద్రం ముఖద్వారం వద్ద చోటుచేసుకుంది.

తన కుమార్తె ఎలాగైనా డాక్టర్ కావాలనే బలమైన కోరికతో, రాత్రింబగళ్లు ఆమెను చదివించి, ఎన్నో ఆశలతో పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చాడు ఆ పేద తండ్రి.

రెండు నిమిషాల ఆలస్యం – కరిగిపోయిన కల:
కానీ, విధి ఆడిన వింత నాటకం వల్ల పరీక్షా కేంద్రానికి చేరుకోవడం కేవలం 2 నిమిషాలు ఆలస్యమైంది. “అయ్యా.. దారిలో బండి పంక్చర్ అయిందయ్యా.. నా బిడ్డ జీవితం పాడైపోతుంది, దయచేసి లోపలికి పంపించండి సార్” అని ఆ తండ్రి ఎంతగానో రోదించినప్పటికీ.. అధికారులు ఏమాత్రం కనికరం లేకుండా ఇనుప గేట్లను మూసివేశారు.

తన కుమార్తె ఏడాది కాలం పడ్డ కష్టం, ఆమె భవిష్యత్తు కలలు తన కళ్ల ముందే కాలిబూడిదైపోతుంటే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. పరీక్షా కేంద్రం గేటు ముందే మోకాళ్లపై పడి, చేతులు జోడించి, అధికారులను భిక్షమడిగినట్లు వేడుకున్న దృశ్యం అక్కడ ఉన్నవారి కళ్లలో రక్తాశ్రువులు తెప్పించింది.

నిబంధనలు మనుషుల కోసమేనా?.. నెట్టింట తీవ్ర చర్చ:
అక్కడున్న పలవురు పర్యాటకులు, తల్లిదండ్రులు అధికారులతో మాట్లాడి బ్రతిమిలాడినప్పటికీ.. “మాకు నిబంధనలే ముఖ్యం” అంటూ అధికారులు మొండిగా నిరాకరించారు. ఒక తండ్రి పడ్డ ఈ తీరని ఆవేదన, ఆ విద్యార్థిని కన్నీళ్లు ప్రస్తుతం సోషల్ మీడియాను అతలాకుతలం చేస్తున్నాయి. “నిబంధనలు మనుషుల కోసమా… లేక మనుషులు నిబంధనల కోసమా?” అనే చర్చ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో దావానంలా వ్యాపిస్తోంది.


Posted

in

by

Tags: