ఒక్క ఓటుతో గెలుపు.. లక్ష ఓట్ల రికార్డు; ఎన్నికల రాష్ట్రాల్లో అతిపెద్ద మరియు అతిచిన్న విజయాలు

న్యూఢిల్లీ: మే 4న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పైనే ఉంది. అక్కడ వీచిన బీజేపీ గాలికి దిగ్గజాలే కుప్పకూలారు; ఏకంగా మమతా బెనర్జీ కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు తమిళనాడులో ‘దళపతి’ విజయ్ పార్టీ జెండా పాతింది.

ఈ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు అతి స్వల్ప ఓట్లతో గట్టెక్కగా, మరికొందరు బంపర్ మెజారిటీతో రికార్డులు సృష్టించారు. ఆ వివరాలు ఇవే:

పశ్చిమ బెంగాల్: హోరాహోరీ పోరు

బెంగాల్‌లో బీజేపీ 206 స్థానాల్లో గెలవగా, టీఎంసీ 81 స్థానాలకే పరిమితమైంది.

  • అతిచిన్న విజయం: రాజర్‌హాట్ న్యూ టౌన్ స్థానంలో టీఎంసీ అభ్యర్థి తాపస్ ఛటర్జీ కేవలం 323 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు.
  • అతిపెద్ద విజయం: మాటిగరా-నక్సల్బరీ సీటులో బీజేపీ అభ్యర్థి ఆనందమయ్ బర్మన్ 1,04,265 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద విజయాల్లో ఒకటి.
తమిళనాడు: విజయ్ పార్టీ సంచలనం

తమిళనాడులో ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ ఏకంగా 108 స్థానాలు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

  • అతిచిన్న విజయం: తిరుపత్తూరు నియోజకవర్గంలో TVK అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి కేవలం 1 ఓటు తేడాతో డీఎంకే అభ్యర్థిపై గెలిచి చరిత్ర సృష్టించారు.
  • అతిపెద్ద విజయం: మాధవరం నియోజకవర్గం నుంచి TVK అభ్యర్థి ఎం.ఎల్. విజయప్రభు 94,985 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
కేరళ: స్వల్ప మెజారిటీ
  • అతిచిన్న విజయం: మణలూర్ స్థానంలో సీపీఎం అభ్యర్థి ప్రొఫెసర్ సి. రవీంద్రనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిపై కేవలం 126 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
  • అతిపెద్ద విజయం: మలప్పురం సీటులో ఐయూఎంఎల్ (UDF) అభ్యర్థి పి.కె. కున్హాలికుట్టి 85,327 ఓట్ల మెజారిటీతో ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థిని ఓడించారు.
అస్సాం: బీజేపీ హవా
  • అతిచిన్న విజయం: హాజో-సువాల్‌కుచి స్థానంలో ఏజీపీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర దాస్ కాంగ్రెస్ అభ్యర్థిపై 724 ఓట్ల తేడాతో గెలిచారు.
  • అతిపెద్ద విజయం: జాగీరోడ్ (SC) స్థానంలో బీజేపీ అభ్యర్థి పిజూష్ హజారికా కాంగ్రెస్ అభ్యర్థిపై 93,584 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

Posted

in

by

Tags: