“ఒరేయ్.. ఏం చేస్తున్నావురా తమ్ముడూ! ఆపు..!” డ్రైవర్ లేకుండా పరుగులు తీసిన డ్రైవర్‌లెస్ కారు.. నేరుగా వెళ్లి పోలీస్ వ్యాన్‌పైకి దూసుకెళ్లిన షాకింగ్ దృశ్యం.!!

పాకిస్తాన్‌లో ఆటోమేటిక్ (డ్రైవర్‌లెస్) కారును పరీక్షిస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర ఉదంతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

మహమ్మద్ ఆలీజా అనే పాకిస్తానీ జర్నలిస్ట్, డ్రైవర్ లేకుండా దానంతట అదే నడిచే కారు ముందు సీట్లో కూర్చుని గర్వంగా వీడియో తీయడం ప్రారంభించారు. ఆ వీడియోలో ఆయన “పాకిస్తాన్‌లో ప్రతిభకు కొదవే లేదు” అని చెబుతున్న కొన్ని సెకన్లలోనే.. ఆ కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి, రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టి ప్రమాదానికి గురైంది.

ఇంటర్నెట్ కనెక్టివిటీలో అంతరాయం ఏర్పడటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని, దానివల్ల సాంకేతిక లోపం తలెత్తి కారు నియంత్రణ కోల్పోయిందని ఆలీజా వివరణ ఇచ్చారు. ఎహసాన్ జాఫర్ అనే సాంకేతిక నిపుణుడు రూపొందించిన ఈ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ ఎదురైంది. ముఖ్యంగా, భారతీయ నటుడు రణ్‌వీర్ షోరే ఈ వీడియోను రీపోస్ట్ చేస్తూ.. టెస్లా (Tesla) కారుకు పాకిస్తాన్ కనిపెట్టిన సమాధానం “ది మస్లా” (The Masla – సమస్య) అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

పోలీస్ వాహనాన్ని కారు ఢీకొట్టినప్పటికీ, బాధ్యులపై ఇస్లామాబాద్ పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీనిపై పోలీసు అధికారి డాక్టర్ అయాజ్ హుస్సేన్ వివరణ ఇస్తూ.. కొత్త టెక్నాలజీలను కనిపెట్టే ప్రయోగాల్లో ఇలాంటి సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలు జరగడం సాధారణమేనని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ యువకులను తాము ప్రోత్సహిస్తున్నామని, వీరే “పాకిస్తాన్ భవిష్యత్తు” అంటూ ప్రశంసించి పోలీసులు తమ ఉదారతను చాటుకున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *