అమెరికాలో ఎవరూ ఊహించని విధంగా ఒక పెంపుడు జంతువు చేసిన విపరీతమైన పని, ఒక ఇల్లు మొత్తం బూడిదవడానికి కారణమవడమే కాకుండా అక్కడ ఉన్న మూడు మూగజీవాల ప్రాణాలను బలితీసుకున్న షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.
ఇంటి యజమాని బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో పెంచుకుంటున్న ఒక కుక్క వంటగదిలో చేసిన చిన్న పొరపాటు.. మొత్తం ఇల్లు అగ్నికి ఆహుతయ్యేలా చేసింది. ఈ ప్రమాదం అక్కడ ఉన్న ఇతర పెంపుడు జంతువుల ప్రాణాలకు ముప్పుగా మారడం తీవ్ర విషాదాన్ని నింపింది.
సంఘటన జరిగిన రోజున ఇంటి యజమాని బయటకు వెళ్లగా, ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క వంటగదిలోని టోస్టర్ను (Toaster) పొరపాటున ఆన్ (On) చేసింది. దీనివల్ల కొన్ని నిమిషాల్లోనే వంటగదిలో మంటలు చెలరేగి, ఇల్లు మొత్తానికి వేగంగా వ్యాపించాయి.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సుమారు 20 గంటలకు పైగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘోర ప్రమాదంలో ఇంట్లో ఉన్న 3 పెంపుడు జంతువులు మంటల్లో కాలిపోయి నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోయాయి. అదే సమయంలో, ఈ అగ్ని ప్రమాదానికి కారణమైన ‘బో’ (Bo) అనే కుక్కతో పాటు, ‘ఆడిస్’ (Addies) అనే మరో కుక్క సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాయి.
