కొలంబోలో నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ ఘోర ఓటమిని జీర్ణించుకోలేక పాకిస్థాన్ అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్న వీడియోలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అందులో ఒక వీడియోలో, పాకిస్థాన్‌కు చెందిన ఒక యూట్యూబర్ ఓటమి ఆవేశంలో ఒక మహిళ ముఖానికి కేక్‌ను బలంగా రుద్ది అనాగరికంగా ప్రవర్తించాడు. ఇది కేవలం సరదా అని కొందరు అంటున్నా, “మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?” అని మెజారిటీ నెటిజన్లు మండిపడుతున్నారు. మరో వీడియోలో, పాకిస్థాన్ అభిమాని ఒకరు తన దేశం ఓడిపోయిన నిరాశలో ఆవేశంతో తన ఇంట్లోని టీవీని పగులగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మెరుపు అర్ధశతకంతో భారత్ 176 పరుగులు చేయగా, పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలింది. ప్రతిసారి భారత్ చేతిలో దెబ్బ తింటున్న పాకిస్థాన్ అభిమానుల ఈ విపరీత చేష్టలు, “క్రీడను క్రీడలా చూడలేరా?” అనే విమర్శలకు దారితీస్తున్నాయి.
