భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికన్ స్టాండప్ కమెడియన్, రచయిత్రి జార్నా గార్గ్ (Zarna Garg).. జర్మనీలోని బెర్లిన్ నగరంలో గల ప్రఖ్యాత అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ ‘హెర్మేస్’ (Hermès) షోరూమ్‌కు వెళ్లారు.
అక్కడ వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో డోర్ జామ్ అయిపోవడంతో, ఆమె ఏకంగా 80 నిమిషాలకు పైగా లోపలే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బంది పడ్డారు.
స్టోర్ సిబ్బంది డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో, చివరకు అగ్నిమాపక సిబ్బంది (ఫైర్ బ్రిగేడ్) రంగంలోకి దిగి తలుపు బద్దలుకొట్టి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ఈ దారుణ ఘటన జరిగిన తర్వాత కూడా స్టోర్ యాజమాన్యం గానీ, సిబ్బంది గానీ తనకు లేదా తన కుటుంబ సభ్యులకు ఎలాంటి క్షమాపణలు చెప్పలేదని, కేవలం ఒక చవకబారు షాంపైన్ బాటిల్ చేతిలో పెట్టి కవర్ చేయడానికి ప్రయత్నించారని జార్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎప్పటికీ ఓపెన్ చేయలేని బ్యాగ్‌లను తయారు చేసే ఈ కంపెనీ.. ఇప్పుడు ఓపెన్ చేయలేని తలుపులను కూడా పెట్టుకుంది; పనికిమాలిన బ్యాగ్, పనికిమాలిన డోర్, పనికిమాలిన మనుషులు” అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఘాటుగా విమర్శిస్తూ వీడియోను పోస్ట్ చేశారు.

Leave a Reply