కన్యాకుమారి టూ ఉత్తరప్రదేశ్.. అశ్లీల వీడియోతో చిక్కుకున్న యువకుడు.. అదిరిపోయే యాక్షన్ తీసుకున్న పోలీసులు.. ఏం జరిగింది?

కన్యాకుమారి జిల్లా మార్తాండానికి చెందిన పాఠశాల విద్యార్థినితో ఆన్‌లైన్ గేమ్ ద్వారా పరిచయం పెంచుకుని, అశ్లీల వీడియో కాల్‌ను రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఉత్తరప్రదేశ్ యువకుడిని పోలీసులు ఆ రాష్ట్రానికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు.

మార్తాండం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలైంది. ఫోన్‌లో గేమ్‌లు ఆడుతున్న క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజయ్ (21) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇంటి వారికి తెలియకుండా అతనితో వీడియో కాల్స్ మాట్లాడుతూ అశ్లీల సంభాషణలు జరిపింది.

దీన్ని అదునుగా తీసుకున్న అజయ్, ఆ వీడియో కాల్‌ను రికార్డ్ చేసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పి కన్నీరుమున్నీరైంది. షాక్‌కు గురైన తల్లిదండ్రులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందినవాడని తేలింది. వెంటనే కన్యాకుమారి పోలీసులు ఆగ్రాకు వెళ్లి అజయ్‌ను అరెస్ట్ చేసి తమిళనాడుకు తీసుకొచ్చారు. విచారణలో నేరం రుజువు కావడంతో అతనిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.


Posted

in

by

Tags: