కలకలం.. 21 ఎముకలు ఫ్రాక్చర్.. మెట్ల కింద స్పృహలేకుండా పడి ఉన్న పసికందు.. 2 ఏళ్ల చిన్నారిని చిదిమేసిన తల్లి ప్రియుడు! వారాల తరబడి సాగిన నరకం వెలుగుచూసిందిలా!

లండన్: ఇంగ్లాండ్‌కు చెందిన ‘ఇసబెల్’ అనే రెండేళ్ల చిన్నారి.. తన కన్నతల్లి అలెగ్జాండ్రా వాకర్ (25), ఆమె ప్రియుడు హారిసన్ సింప్సన్ (22) చేతిలో వారాల తరబడి అత్యంత క్రూరమైన హింసకు, లైంగిక దాడికి గురైంది. చివరకు తలకు తగిలిన తీవ్రమైన గాయం కారణంగా ఆ పసికందు ప్రాణాలు కోల్పోయింది.

గత 2025 సెప్టెంబర్ 12న లండన్ సమీపంలోని హార్డింగ్టన్ క్లోజ్ ప్రాంతంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది (పారామెడిక్స్), ఆ చిన్నారిని ఇంట్లోని మెట్ల కింద (Under the stairs) స్పృహలేని స్థితిలో కనుగొన్నారు. వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఐసీయూలో రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆ పాప కన్నుమూసింది.

పోస్ట్‌మార్టం నివేదికలో షాకింగ్ నిజాలు:
టీస్‌సైడ్ క్రౌన్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాది సమర్పించిన పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. ఆ పసికందు శరీరంపై ఉన్న గాయాలు చూసి వైద్యులే షాక్‌కు గురయ్యారు. చిన్నారి తల, మెడ, పొట్ట, వెన్నుభాగం మరియు జననేంద్రియాలపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు తేలింది.

నిందితులు ఆ బేబీని ఎంత క్రూరంగా ఊపేశారంటే.. ఆ ధాటికి చిన్నారి వెన్నెముక తీవ్రంగా సాగిపోయింది. అంతేకాకుండా పాప తలను ఏదైనా గట్టి ఉపరితలానికి (గోడ లేదా నేలకు) బలంగా కొట్టినట్లు గుర్తించారు. చిన్నారి శరీరంలో ఏకంగా 21 ఎముకల ఫ్రాక్చర్లు (ముక్కులు) అయినట్లు, శారీరక దాడి వల్ల అనేక అంతర్గత గాయాలు జరిగినట్లు పోస్ట్‌మార్టంలో తేలింది.

తీవ్రమైన డ్రగ్స్, మద్యానికి బానిసలైన ఈ జంట.. గత వేసవి కాలంలో ఒకటైనప్పటి నుండి ఈ చిన్నారిని నిరంతరం శారీరక హింసకు, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు కోర్టులో ఆరోపణలు నమోదయ్యాయి.

వైద్యుల నిర్లక్ష్యం – ఆలస్యంగా అంబులెన్స్:
ఇసబెల్ మరణించడానికి రెండు వారాల ముందే.. కాలు విరగడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనే కొందరు వైద్యులు ఆ పాప పరిస్థితిని చూసి అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, దానిని నిర్లక్ష్యం చేసి చిన్నారిని తిరిగి ఆ తల్లికే అప్పగించారు.

పాపకు ఇన్ని పెద్ద గాయాలు జరిగి, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ.. నిందితులు పోలీసులకు దొరికిపోతామనే భయంతో వైద్య సహాయం అందించకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు. చివరకు చిన్నారి పరిస్థితి పూర్తిగా విషమించడంతో, ప్రియుడు చెప్పిన తర్వాతే తల్లి అంబులెన్స్‌కు కాల్ చేసింది.

తమ పాపాన్ని దాచడానికి ఇద్దరూ రకరకాల అబద్ధాలు ఆడినప్పటికీ, వైద్య నివేదికలతో అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం ఈ నిందితులిద్దరిపై పసికందును వేధించి, హత్య చేసినందుకు గాను కోర్టులో తీవ్రస్థాయిలో విచారణ కొనసాగుతోంది.


Posted

in

by

Tags: