“కలిసి చనిపోదామని పిలుచుకొచ్చి..” ఫ్లైఓవర్ పైనుంచి దూకేసిన ప్రియుడు.. భయంతో ఎస్కేప్ అయిన ప్రియురాల.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న నైని ఫ్లైఓవర్ (Naini Overbridge) పై ఎవరూ ఊహించని విధంగా ఒక విచిత్రమైన ప్రేమ విపరీత ఘాతుకం చోటుచేసుకుంది.

ప్రేమ కోసం కలిసి ప్రాణాలు విడుద్దామని నిర్ణయించుకుని ఫ్లైఓవర్ పైకి వచ్చిన ఒక జంటలో, ప్రియుడు మాత్రమే కింద ఉన్న రోడ్డుపైకి దూకేశాడు. చివరి నిమిషంలో ప్రియురాలు వెనకడుగు వేసి అక్కడి నుండి పారిపోయిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది.

ఫ్లైఓవర్ పైకి వచ్చిన ప్రియుడు, ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడానికి కిందకు దూకడానికి సిద్ధంగా నిలబడ్డారు. అయితే, కౌంట్‌డౌన్ ముగిసి ప్రియుడు ఫ్లైఓవర్ పైనుంచి కింద ఉన్న రోడ్డుపైకి దూకిన మరుక్షణమే, భయపడిపోయిన ప్రియురాలు తన ఆత్మహత్య నిర్ణయాన్ని పూర్తిగా విరమించుకుని అక్కడి నుండి పారిపోయింది.

అదృష్టవశాత్తూ, ఫ్లైఓవర్ పైనుంచి కింద రోడ్డుపై పడిన ఆ యువకుడు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు కింద పడటం చూసిన స్థానికులు వెంటనే స్పందించి అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రేమ పిచ్చితో రోడ్డుపైకి దూకిన ఆ ప్రియుడు, ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు.


Posted

in

by

Tags: