కామంతో కళ్లు మూసకపోయి.. బాబాయ్‌ కోసం ప్రియురాలి బలి! వికృత కోరికను నిరాకరించిందని చంపి.. శవాన్ని బెడ్ బాక్స్‌లో కుక్కాడు!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సభ్యసమాజం తలదించుకునే దారుణం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో దగ్గరైన ఒక యువకుడు.. తన ప్రియురాలిని కనీసం మనిషిగా కూడా చూడకుండా, తన బాబాయ్ కోరిక తీర్చాలంటూ నరకం చూపించాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ కిరాతకుడు, ఆమెను అత్యంత క్రూరంగా హత్య చేసి శవాన్ని బెడ్ బాక్స్‌లో దాచిపెట్టాడు. మంగోల్‌పురి ప్రాంతంలో జరిగిన ఈ ఘోరం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

ఘటన వివరాలు:
మంగోల్‌పురికి చెందిన 35 ఏళ్ల మహిళ ముగ్గురు పిల్లల తల్లి. స్థానికంగా ఇళ్లలో పని చేస్తూ జీవనం సాగించేది. అదే ప్రాంతంలో చికెన్ షాపు నడుపుతున్న 22 ఏళ్ల యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమకు దారితీసింది. అయితే, ఈ ప్రేమ వెనుక ఆ యువకుడికి ఒక వికృత ఆలోచన ఉంది. తన బాబాయ్‌తో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆమెపై నిరంతరం ఒత్తిడి చేసేవాడు.

పథకం ప్రకారం హత్య:
బాబాయ్ కోరిక తీర్చడానికి ఆమె నిరాకరించడంతో, ఆమెను వదిలించుకోవాలని ఆ యువకుడు పథకం వేశాడు. తన స్నేహితుడి గదికి బాబాయ్‌ని, మరో స్నేహితుడిని పిలిపించాడు. అనంతరం ప్రియురాలిని కూడా అక్కడికి రప్పించాడు. మరోసారి బాబాయ్ విషయం ఎత్తగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో రెచ్చిపోయిన ఆ ఉన్మాది.. ఆమెను గోడకేసి కొట్టి, ఆపై దుప్పటితో గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక, శవాన్ని అక్కడే ఉన్న బెడ్ బాక్స్‌లో కుక్కి, నిందితులు ముగ్గురూ అక్కడి నుండి పరారయ్యారు.

బయటపడ్డ పాపం:
సాయంత్రం గది యజమాని వచ్చి చూడగా, బెడ్ బాక్స్ లోంచి ఒక కాలు బయటకు వచ్చి ఉండటం గమనించాడు. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా, మహిళ మృతదేహం కనిపించడంతో భీతిల్లిపోయి పోలీసులకు సమాచారం అందించాడు. ఆమె నుదుటిపై ఉన్న గాయాలు ఇది పక్కాగా హత్యేనని నిర్ధారించాయి. ఫింగర్ ప్రింట్ ఎక్స్‌పర్ట్స్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.

నిందితుల అరెస్ట్:
రంగంలోకి దిగిన పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి.. ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన బాబాయ్‌ని, స్నేహితుడిని అరెస్ట్ చేశారు. ముగ్గురు పిల్లలకు తల్లి అని కూడా చూడకుండా, ఒక వికృత కోరిక కోసం నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags: