ఉక్రెయిన్ యుద్ధభూమిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సైనికులను రక్షించేందుకు ఉక్రెయిన్ సైన్యం తొలిసారిగా ‘స్టార్గేట్’ (Stargate) అనే కొత్త వైమానిక రెస్క్యూ డ్రోన్‌ను ఉపయోగించింది.
రష్యా సరిహద్దుకు సమీపంలో జరిగిన ఈ ఘటనలో, కాలికి తీవ్ర గాయమై రక్తం కారుతున్న స్థితిలో 2 రోజులుగా యుద్ధభూమిలో చిక్కుకున్న 24 ఏళ్ల సైనికుడితో సహా ఇద్దరిని ఈ డ్రోన్ ద్వారా సురక్షితంగా రక్షించారు.
రక్షించబడిన సైనికుడి కాలు తెగిపోయిన స్థితిలో, 20 కిలోమీటర్ల దూరం నడవలేని పరిస్థితుల్లో ఉన్న అతన్ని, ఈ చిన్న రెస్క్యూ డ్రోన్ కచ్చితంగా చేరుకుని ప్రాణాలు కాపాడింది.
‘సిగార్’ (Cigar) ఆకారంలో ప్రత్యేకంగా రూపొందించిన ఈ రెస్క్యూ క్యాబిన్లో గాయపడిన సైనికుడిని ఉంచి, కేవలం 15 నిమిషాల్లోనే ప్రమాదకరమైన ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి ఆ డ్రోన్ తీసుకెళ్లింది.
రష్యా సరిహద్దు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాదకరమైన ‘గ్రే జోన్’ ప్రాంతంలో చిక్కుకున్న సైనికులను రక్షించేందుకు, ఉక్రెయిన్ సైన్యం పలు వారాల ప్రయోగాల తర్వాతే ఈ ఆధునిక డ్రోన్‌ను యుద్ధభూమిలోకి దించింది.

Leave a Reply