అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ గాబ్రియేల్ వ్యాలీ, కోవినా ప్రాంతంలో మసాజ్ సెంటర్ల పేరుతో అక్రమంగా నడుస్తున్న వ్యభిచార గృహాలను పోలీసులు ఆకస్మిక దాడులు చేసి సీజ్ చేశారు.
మసాజ్ కోసం వెళ్లిన ఒక కుటుంబ సభ్యుడు అందించిన పక్కా సమాచారంతో కోవినా పోలీస్ విభాగం అధికారులు ఈ రహస్య ఆపరేషన్ చేపట్టారు.
పోలీస్ శాఖ తరఫున ఒక అధికారిని నకిలీ కస్టమర్‌గా ప్రతి మసాజ్ కేంద్రానికి పంపించారు. అక్కడి సిబ్బంది వ్యభిచారం కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో, అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న 7 వ్యాపార కేంద్రాలకు పోలీసులు తాళాలు వేశారు. అలాగే వాటిలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నగరంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు, వ్యాపార సంస్థలన్నీ చట్టబద్ధంగా నడిచేలా చూసేందుకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

Leave a Reply