మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల తన కుమార్తెపై తండ్రే లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో బాలిక క్రికెట్ బ్యాట్‌తో తండ్రి తలపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
నాగ్‌పూర్‌కు చెందిన సుమారు 45 ఏళ్ల వ్యక్తి ప్రతిరోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడేవాడని పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన రోజు కూడా అతడు తీవ్ర మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న తన 17 ఏళ్ల కుమార్తెపై అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక దాడికి ప్రయత్నించినట్లు సమాచారం.
తనను రక్షించాల్సిన తండ్రే తనపై దాడికి ప్రయత్నించడంతో బాలిక తీవ్ర భయాందోళనకు గురైంది. అతడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు ఆమెను వదలకుండా వేధించినట్లు తెలుస్తోంది.
దీంతో తనను తాను రక్షించుకునేందుకు బాలిక సమీపంలో ఉన్న క్రికెట్ బ్యాట్‌ను తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టినట్లు సమాచారం.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న నాగ్‌పూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
తనను తాను రక్షించుకునే పరిస్థితిలో 17 ఏళ్ల బాలిక తీసుకున్న చర్యపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply