“కూతురిని చూపిస్తానని తీసుకెళ్లి దారుణం..!” కొత్త జీవితం మొదలుపెట్టాలనుకున్న భార్యను కిరాతకంగా చంపిన భర్త.. భారత్‌కు పారిపోవాలని ప్లాన్.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన..!!

అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన అంకుర్ పటేల్ అనే వ్యక్తి, తనతో కలిసి జీవించడానికి నిరాకరించిందన్న కోపంతో విడిపోయిన భార్యను కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చాడు.

గత మే నెలలో విస్కాన్సిన్‌లోని ఇంటి నుంచి బిడ్డతో సహా విడిపోయి వచ్చిన అతని భార్య, ఆ తర్వాత మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకోవడంతో వీరిద్దరి మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతూ ఉండేవి.

తన కుమార్తెను భారతదేశంలోని తల్లిదండ్రుల వద్దకు పంపించేసిన అంకుర్ పటేల్, భార్యను మాత్రం చికాగోకు రప్పించి, తనతో కలిసి కాపురం చేయాలని ఒత్తిడి చేశాడు. అయితే అందుకు ఆమె ససేమిరా ఒప్పుకోలేదు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పటేల్, ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకుని విమానంలో భారత్‌కు పారిపోయేందుకు యత్నించగా, విమానాశ్రయంలోనే పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.

ఈ కిరాతక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అమెరికా పోలీసులు, అంకుర్ పటేల్‌పై ఫస్ట్-డిగ్రీ మర్డర్ కింద కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *