నాగర్‌కోయిల్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు, ఆదివారం ఉదయం ధర్మపురి జిల్లా ముత్తంపట్టి, శివాడి మధ్య ఉన్న కొండ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తోంది.
ఆ సమయంలో ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా, సమీపంలోని కొండపై నుంచి ఓ భారీ బండరాయి దొర్లుకువచ్చి కదులుతున్న రైలు చక్రాలను బలంగా ఢీకొట్టింది. దీంతో రైలు షాక్ అబ్జార్బర్ తీవ్రంగా ధ్వంసమైంది.
దీన్ని వెంటనే గమనించిన లోకో పైలట్, అప్రమత్తంగా వ్యవహరించి చాకచక్యంగా రైలును నిలిపివేశాడు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న సాంకేతిక నిపుణులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టడంతో, రైలు కాస్త ఆలస్యంగా తన గమ్యస్థానానికి బయలుదేరింది. లోకో పైలట్ సకాలంలో స్పందించి

Leave a Reply