ప్రేమిస్తే భయపడకూడదు’ అనే మాటను వక్రీకరిస్తూ, ఒక కొడుకు తన సవతి తల్లితో ప్రేమలో పడి, ఆమెను తీసుకుని పారిపోయిన ఘటన హర్యానాలోని నూహ్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనతో సదరు వ్యక్తి (తండ్రి) జీవితం చిన్నాభిన్నమైంది.
ఏం జరిగింది? నూహ్ జిల్లాలోని బాసదల్లా గ్రామానికి చెందిన రామ్‌కిషన్‌కు 18 ఏళ్ల క్రితం మొదటి వివాహం జరిగింది. ఆ భార్య మరణించాక, మూడు సంవత్సరాల తర్వాత సోహ్నా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కూతురు కూడా ఉంది. మొదటి భార్యకు పుట్టిన కొడుకు, తన తండ్రి ఆచూకీ తెలుసుకుని కొద్ది నెలల క్రితం వారి వద్దకు వచ్చాడు. తండ్రి ఇంట్లోనే ఆ యువకుడు మూడు నెలల పాటు ఉన్నాడు.
ఈ క్రమంలో, ఆ యువకుడికి, తన సవతి తల్లికి మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది. ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. చివరికి, వారు ఎవరికీ తెలియకుండా ఒక రాత్రి ఇంట్లో ఉన్న నగలు, సుమారు రూ. 30 వేల నగదు తీసుకుని ఇంటి నుంచి పారిపోయారు. ఆ తర్వాత వారు కోర్టులో వివాహం చేసుకున్నారు.
పోలీసుల చుట్టూ తండ్రి ప్రదక్షిణలు: తన భార్య మరియు కొడుకు కనిపించకపోవడంతో ఆవేదన చెందిన రామ్‌కిషన్ గత మూడు నెలలుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ, అతనికి సరైన న్యాయం జరగలేదు. దీనిపై విసిగిపోయిన రామ్‌కిషన్, చివరకు సీఎం విండో (CM Window) ద్వారా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తూ, వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
“నేను ఎంతో నమ్మి ఇంటికి రప్పిస్తే, నా కొడుకు నా భార్యతో ప్రేమాయణం సాగించి నన్ను నట్టేట ముంచాడు. ఒకప్పుడు నా భార్య పాదాలకు నమస్కరించిన వాడు, ఇప్పుడు ఆమెతో కలిసి పారిపోయాడు” అని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
